ఫ్లైఓవర్ల ఫన్నీ ట్రోలింగ్: సోషల్ మీడియాలో వైరల్గా మారిన తెలంగాణ బీజేపీ పోస్ట్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

తెలంగాణ బీజేపీ సోషల్ మీడియాలో పెట్టిన వివాదాస్పద పోస్ట్ పై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నట్లు సోషల్ మీడియా నిపుణులు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ర్యాలీ సందర్భంగా బీజేపీ పెట్టిన పోస్ట్ కు ఉప్పల్ ఫ్లైఓవర్ హ్యాండ్లర్ నేను ఆపుతాను రా అంటూ సరదాగా కౌంటర్ ఇచ్చారు. దీంతో మేడ్చల్, సుచిత్ర ఫ్లైఓవర్ల పేర్లతో పాటు వివిధ ప్రాంతాల రోడ్ ఓవర్ బ్రిడ్జిల ఖాతాలు కూడా రంగంలోకి దిగి ఫన్నీగా ట్రోల్ చేస్తున్నాయని నెటిజన్లు పేర్కొన్నారు.