మంచి మనసు చాటుకున్న హార్దిక్ పాండ్యా: లక్ష డాలర్లు విరాళం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
టీమ్ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన మంచి మనసును చాటుకున్నారు. ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ షోలో పాల్గొని గెలుచుకున్న లక్ష డాలర్ల ప్రైజ్ మనీని ఓ ఛారిటీకి విరాళంగా ఇచ్చారు. ఈ మొత్తాన్ని పేద విద్యార్థులకు ప్రాథమిక విద్య, ఆహారం అందించడంతో పాటు వీధి శునకాల ఆశ్రయం కోసం ఉపయోగించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. మైదానంలోనే కాకుండా మైదానం వెలుపల కూడా తన ఉదారతను చాటుకొని అందరి మనసులు గెలుచుకున్నారని ఆయన వెల్లడించారు.