'చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన': తిరుపతి పోలీస్
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Tirupati
తిరుపతి పోలీస్ శక్తి బృందం కొర్లగుంట ప్రాథమిక పాఠశాలలో చిన్నారులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ మరియు బాల కార్మిక వ్యవస్థ వంటి కీలక అంశాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులకు అసౌకర్యంగా అనిపించే స్పర్శ లేదా ప్రవర్తన ఎదురైతే వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా నమ్మకమైన పెద్దలకు తెలియజేయాలని తిరుపతి పోలీస్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు తగిన సూచనలు అందించారు.