నెల్లూరులో కలకలం: చెల్లని ఓట్లుగా మారిన పన్నెండు వేల పైచిలుకు ఓట్లు

రిపోర్టర్: మహేష్ స్థలం: నెల్లూరు

నెల్లూరు నగరపాలక సంస్థతో పాటు రెండు మున్సిపాలిటీల్ లో సుమారు పన్నెండు వేలకు పైగా ఓట్లు చెల్లనివిగా మారినట్లు అధికారులు వెల్లడించారు. బ్యాలెట్ పేపర్ పై ఓటు వేసే సరైన విధానం తెలియక లేదా కొందరి నిర్లక్ష్యం కారణంగా ఈ భారీ సంఖ్యలో ఓట్లు వృథా అయ్యాయని అధికారులు తెలిపారు. నెల్లూరు నగరంలో మేయర్ స్థానంతో పాటు డివిజన్ల వారీగా భారీగా ఓట్లు రద్దయినట్లు ఎన్నికల అధికారులు స్పష్టం చేశారు.