పోలీస్ వ్యవస్థకు వెన్నెముక కానిస్టేబుళ్లు అంటూ వంగలపూడి అనిత ప్రశంస

రిపోర్టర్: మహేష్ స్థలం: అనకాపల్లి

పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. అర్ధరాత్రి వేళ ఆడపిల్లకు, కష్టాల్లో ఉన్న వృద్ధులకు పోలీస్ యూనిఫాం భరోసానిస్తుందని పేర్కొన్నారు. ఎంతో అదృష్టం ఉంటేనే ఈ యూనిఫాం ధరించే అవకాశం దక్కుతుందని ఆమె స్పష్టం చేశారు.