పిడూరులో అంగరంగ వైభవంగా చెన్నకేశవ స్వామి తిరునాళ్లు ప్రారంభం
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
మనుబోలు మండలం పిడూరు గ్రామంలో శ్రీ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామి తిరునాళ్లు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవాలయ ప్రాంగణాన్ని, పురవీధులను విద్యుత్ దీపాలతో అలంకరించి, భక్తిశ్రద్ధలతో వేడుకలను మొదలుపెట్టారు.
ఈ ప్రారంభోత్సవానికి తిక్కవరపు వెంకటేశ్వర్లు రెడ్డి-సుప్రజ, శ్రీధర్ రెడ్డి-సుహాసిని దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గ్రామ పెద్దలు, నాయకులు మరియు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారి ప్రసాదాలను స్వీకరించి, వేడుకల్లో భక్తిపూర్వకంగా పాల్గొన్నారు.