విశాఖలో ఇళ్ల పట్టాల పంపిణీకి కూటమి సర్కార్ శ్రీకారం
రిపోర్టర్: మహేష్
స్థలం: Visakhapatnam
పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ముందుకువెళ్తోంది. ఇందులో భాగంగా విశాఖ నగరంలో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఐదు మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.