'ఎయిర్‌పోర్ట్ స్థాయి సదుపాయాలు': తెలంగాణలో 13 హైటెక్ బస్ స్టేషన్ల నిర్మాణం
రిపోర్టర్: భాస్కర్
స్థలం: తెలంగాణ
తెలంగాణలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎండీ వై. నాగిరెడ్డి ఆలోచన మేరకు రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రాంతాలలో మల్టీప్లెక్స్ రేంజ్ హంగులతో నూతన హైటెక్ బస్ స్టేషన్లను నిర్మించనున్నారు. నాగర్‌కర్నూల్, నల్గొండ, కొత్తగూడెం, కొడంగల్, హుజూర్‌నగర్ తదితర ప్రాంతాలలో ఇంటిగ్రేటెడ్ ట్రాన్సిట్ సిస్టమ్ విధానంలో ఫుడ్ కోర్టులు, షాపింగ్ కాంప్లెక్స్‌లతో ఎయిర్‌పోర్ట్ స్థాయి వసతులతో ఈ బస్టాండ్లను అభివృద్ధి చేయనున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది.