షాకింగ్ ఘటన: ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్ పై దాడి మరియు భారతీయ కెప్టెన్ ఎయిర్ లిఫ్ట్

రిపోర్టర్: గోపి స్థలం: Dubai

ఫ్లై దుబాయ్ విమానంలో తోటి పైలట్ దాడిని ప్రతిఘటించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, మెరుగైన వైద్యం కోసం సౌది అరేబియా నుంచి దుబాయ్ కి ఎయిర్ లిఫ్ట్ చేస్తున్నట్లు రియాద్లోని భారత రాయబార కార్యాలయం గురువారం వెల్లడించింది. కుటుంబ సభ్యులతో సంప్రదింపులు జరుపుతూ అన్ని విధాలా సహాయం అందిస్తామని అధికారులు తెలిపారు.