క్రాంతికుమార్ ఆత్మహత్య కేసులో విచారణ జరిపి నోటీసులు జారీ చేసిన హైకోర్టు
రిపోర్టర్: సునీల్
స్థలం: విజయవాడ
కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు వేధింపులతో తన కుమారుడు క్రాంతికుమార్ ఆత్మహత్య చేసుకున్నాడని, దర్యాప్తు సక్రమంగా జరగడం లేదంటూ మృతుని తండ్రి వెంకటేశ్వరరావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై విచారణ చేపట్టిన న్యాయమూర్తి జస్టిస్ కుంచం మహేశ్వరరావు హోంశాఖ, డీజీపీ, సీఐ నాగరాజుతో పాటు అధికారులకు నోటీసులు జారీ చేశారు. కేసు ఉపసంహరించుకోవాలని బెదిరించవద్దని స్పష్టం చేస్తూ, విచారణను ఆరు వారాలకు వాయిదా వేశారు.