వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామన్న కొండా సురేఖ

రిపోర్టర్: రమేష్ స్థలం: వరంగల్

వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని మంత్రి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మొత్తం 112 మంది అర్హులైన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి స్పష్టం చేశారు. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలని పిలుపునిచ్చారు.