బడి పిల్లల్లో సమానత్వం కోసం స్టీలు పళ్లెల పంపిణీ
రిపోర్టర్: శివ
స్థలం: వైఎస్సార్ కడప
పాఠశాలల్లో విద్యార్థుల్లో కుల, వర్గ భేదాలు తొలగించి సామాజిక సమానత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో వైఎస్సార్ కడప జిల్లాలో ప్రభుత్వం వినూత్న కార్యక్రమం చేపట్టింది. మధ్యాహ్న భోజనం కోసం విద్యార్థులకు ‘స్టీలు పళ్లేలు’ పంపిణీ చేస్తోంది. హబ్-స్పోక్ విధానంలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 1,237 పాఠశాలల్లో 69,823 పళ్లేలు అందజేశారు. విద్యార్థుల్లో సోదరభావం పెంపొందించడానికి ఈ విధానం దోహదపడుతోంది.