కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సైకిల్ యాత్ర ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: New Delhi

దిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్ వద్ద ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సైకిల్ యాత్ర తుది విడతను ఎయిర్ మార్షల్ శివ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. కన్యాకుమారి నుంచి కార్గిల్ వరకు సాగే ఈ సాహసయాత్ర దేశభక్తిని, సైనికుల త్యాగాలను స్మరిస్తూ కొనసాగుతోంది.