'దళితులపై ప్రేమ వట్టి భూటకమే': ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ అవమానంపై విమర్శలు
రిపోర్టర్: సురేష్
స్థలం: తెలంగాణ
ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ హోదాలో ఉన్న అద్దంకి దయాకర్‌ను వెనుక వరుసలో కూర్చోబెట్టడం తీవ్ర దుమారం రేపింది. ఎలాంటి ప్రభుత్వ హోదా లేని సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు ఫహీమ్ ఖురేషి, రోహిన్ రెడ్డిలను ముందు వరుసలో కూర్చోబెట్టి, దళిత నేత అయిన అద్దంకి దయాకర్‌కు అవమానం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొద్దున లేస్తే దళితుల గురించి గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ ఆచరణలో మాత్రం వివక్ష చూపుతోందని ఈ ఘటనతో మరోసారి రుజువైందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు.