నిరుద్యోగులకు గుడ్ న్యూస్: సివిల్స్ ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: విజయనగరం
యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లాలోని బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు వారు పేర్కొన్నారు. అర్హులైన పేద, మధ్యతరగతి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు. ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.