విశాఖలో వాల్మార్ట్ వృద్ధి ఎంఎస్ఎంఈ సదస్సు నిర్వహణపై శ్రీనివాస్ హర్షం

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయనగరం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని కొండపల్లి శ్రీనివాస్ విజయనగరం వెల్లడించారు. ఐడియాస్ టు ఇంపాక్ట్ ఫౌండేషన్, వాల్మార్ట్ మార్కెట్ప్లేస్, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక వాల్మార్ట్ వృద్ధి ఎంఎస్ఎంఈ కనెక్ట్ 2026 సదస్సును నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా స్థానిక పారిశ్రామికవేత్తలకు నూతన వ్యాపార అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్ర ఆర్థిక వృద్ధి వేగవంతమవుతుందని ఆయన పేర్కొన్నారు.