గుజరాత్లో ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి నకిలీ నోట్ల ముద్రణ
రిపోర్టర్: అశోక్
స్థలం: Rajkot
రాజ్‌కోట్ సిటీ క్రైమ్ బ్రాండ్ మరియు స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో కూరగాయల వ్యాపారి కిషన్ సోలంకి అప్పులపాలై ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి టెలిగ్రామ్ ద్వారా శిక్షణ పొంది నకిలీ వంద, ఐదు వందల రూపాయల నోట్లను ముద్రిస్తూ పోలీసులకు చిక్కాడు. మాందడుంగర్ ప్రాంతంలోని అతడి నివాసంలో సోదాలు నిర్వహించి భారీగా ఫేక్ నోట్లు, ప్రింటింగ్ సామగ్రిని స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేసినట్లు అధికారులు తెలిపారు.