అమెజాన్‌లో ప్రత్యేక ఏఐ గణేష్ చతుర్థి స్టోర్ ప్రారంభం

రిపోర్టర్: సునీల్ స్థలం: భారతదేశం

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వినాయక చవితి పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ఏఐ ఆధారిత ‘గణేష్ చతుర్థి స్టోర్’ను అందుబాటులోకి తెచ్చింది. పర్యావరణహిత విగ్రహాలు, పూజా సామాగ్రిపై భారీ తగ్గింపులు ప్రకటించింది. అమెజాన్ నౌ ద్వారా దేశవ్యాప్తంగా నిమిషాల వ్యవధిలోనే డెలివరీ సదుపాయం కల్పిస్తోంది. రూఫస్, లెన్స్ ఏఐ వంటి అధునాతన ఫీచర్లతో వినియోగదారులకు వేగవంతమైన షాపింగ్ అనుభవాన్ని అందిస్తోంది.