కట్టుపల్లిలో సెప్టెంబర్ 7న ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం

రిపోర్టర్: MADHIRI CHANTIBABU స్థలం: జి.కె.వీధి

అల్లూరి జిల్లా కలెక్టర్ సూచనల మేరకు గూడెంకొత్తవీధి మండలంలో గతంలో రీ-సర్వే పూర్తయిన గ్రామాల్లో ‘మీ భూమి–మీ హక్కు’ కార్యక్రమం కింద భూ హక్కు పత్రాల పంపిణీ చేపట్టనున్నట్లు తహసీల్దార్ హెచ్. అన్నాజీ రావు తెలిపారు. ఈ మేరకు పాస్పుస్తకాల పంపిణీ షెడ్యూల్ను ఆయన వెల్లడించారు.

సెప్టెంబర్ 7వ తేదీన దామనాపల్లి పంచాయతీ పరిధిలోని కట్టుపల్లి గ్రామంలో ఈ భూ హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక పీసా గ్రామసభ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు మరియు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని తహసీల్దార్ కోరారు.