యూపీ టీ20 లీగ్ టైటిల్ కైవసం చేసుకున్న రింకు సింగ్

రిపోర్టర్: విజయ్ స్థలం: ఉత్తర ప్రదేశ్

యూపీ టీ20 లీగ్ ఫైనల్ పోరులో లక్నో ఫాల్కన్స్‌ను 94 పరుగుల భారీ తేడాతో మీరట్ మేవరిక్స్ చిత్తు చేసింది. రింకు సింగ్ సారథ్యంలోని మీరట్ జట్టు ఈ ఘన విజయంతో టైటిల్‌ను కైవసం చేసుకుంది. లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఈ విజయంతో ఐపీఎల్‌లో కేకేఆర్ కెప్టెన్సీ రేసులో రింకు పేరు బలంగా వినిపిస్తోంది.