ఆస్టిన్‌లో వైభవంగా ఆస్టిన్ పాఠశాల విశ్వగురుకులం 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆస్టిన్

ఆస్టిన్ పాఠశాల, విశ్వగురుకులం 2026-27 విద్యా సంవత్సరాన్ని ఉత్సాహంగా ప్రారంభించాయి. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి తెలుగు కుటుంబాల నుంచి అపూర్వ స్పందన లభించింది. దేశవ్యాప్తంగా అత్యధిక పాఠశాల నమోదులను సాధించిన నగరంగా ఆస్టిన్ నిలిచింది. ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సేవకులు, తానా అధ్యక్షులు నరేంద్ర కొడాలి తదితరుల సహకారంతో ఈ వేడుక ఘనంగా నిర్వహించబడింది.