క్రాష్ డైట్‌తో శ్రీదేవి ఆరోగ్యం క్షీణించిందంటూ దర్శకుడు పంకజ్ పరాశర్ వెల్లడి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: Hyderabad
దివంగత నటి శ్రీదేవి గతంలో తీవ్రమైన క్రాష్ డైట్ పాటించడం వల్ల తన ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు ప్రముఖ చలనచిత్ర దర్శకుడు పంకజ్ పరాశర్ తెలిపారు. మేరీ బీవీ కా జవాబ్ నహీ సినిమా షూటింగ్ సమయంలో బరువు తగ్గాలనే ఒత్తిడితో ఆమె ఉప్పు మానేశారని, దీనివల్ల రక్తపోటు పడిపోయి కళ్లు తిరిగి పడిపోయారని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడి కొన్ని నిమిషాల పాటు అపస్మారక స్థితిలోకి వెళ్లారని, ఈ సంఘటన ఆ సినిమా షూటింగ్‌పై తీవ్ర ప్రభావం చూపిందని ఆయన వివరించారు.