న్యాయవాదులకు అలర్ట్: రేపటి నుంచి ఏఐబీఈ దరఖాస్తుల సవరణకు అవకాశం

రిపోర్టర్: హరి స్థలం: న్యూఢిల్లీ

అఖిల భారత బార్ పరీక్ష ఏఐబీఈ 22 దరఖాస్తుల సవరణ విండోను రేపు అక్టోబర్ 29 నుంచి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రారంభించనుందని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు తమ అధికారిక వెబ్సైట్ ద్వారా దరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకోవచ్చని తెలిపారు. అక్టోబర్ 28లోగా ఫీజు చెల్లించిన అభ్యర్థులు మాత్రమే మార్పులు చేసేందుకు అర్హులని స్పష్టం చేశారు. నవంబర్ 14న పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.