రాజకీయ సంచలనం: సొంత నియోజకవర్గంలో హోంమంత్రి అనితకు ఊహించని షాక్
రిపోర్టర్: రాము
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నట్లు రాజకీయ వర్గాలు వెల్లడించాయి. హోంమంత్రి వంగలపూడి అనిత సొంత నియోజకవర్గమైన పాయకరావుపేటలో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నక్కపల్లిలో స్వయంగా హోంమంత్రి ఓటు వేసిన ప్రాంతంలోనే విపక్ష అభ్యర్థులు గెలవడం అధికార పార్టీ శ్రేణుల్లో విస్మయం కలిగించింది.