డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు: బీఆర్ఎస్ నేతలకు సీఎం రేవంత్ సవాల్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: వికారాబాద్

రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మరియు ఇతర అంశాలపై చర్చించేందుకు డిసెంబర్లో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని స్పీకర్ను కోరుతున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. వికారాబాద్ జిల్లా హకీంపేటలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, ప్రతిపక్ష నేతలు కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావు చర్చకు రావాలని సవాల్ విసిరారు. వాస్తవాలు ప్రజలకు తెలియజేసేందుకే అసెంబ్లీ వేదికగా చర్చిస్తామని ఆయన స్పష్టం చేశారు.