ఉచిత విద్యుత్ కోసం పీఎం సూర్య ఘర్పై అవగాహన సదస్సు

రిపోర్టర్: BHANUCHANDER DOMMATI స్థలం: వర్ధన్నపేట

వరంగల్ జిల్లా వర్ధన్నపేట విద్యుత్ ఉపకేంద్రంలో పీఎం సూర్య ఘర్ ముఫ్ బిజిలి యోజనపై గురువారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి, విద్యుత్ డీఏఈ దానయ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంటి పైకప్పులపై సోలార్ ప్యానెళ్ల ఏర్పాటు, లభించే రాయితీలు, బ్యాంకు రుణాల ప్రక్రియపై అధికారులు స్పష్టమైన సమాచారం అందించారు. సౌర విద్యుత్ వినియోగంతో గృహ విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించుకోవచ్చని తెలపగా, స్థానిక కౌన్సిలర్ పాపారావు, ఇతర అధికారులు పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.