'కొచ్చిలో అక్టోబర్ 28న డబ్ల్యూపీఎల్ 2027 వేలం': బీసీసీఐ ప్రకటన

రిపోర్టర్: సురేష్ స్థలం: భారత్

మహిళల ప్రీమియర్ లీగ్ ఐదో సీజన్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఖరారు చేసింది. డబ్ల్యూపీఎల్ 2027 టోర్నమెంట్ జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. అలాగే సెప్టెంబర్ 28 నాటికి ప్లేయర్ల రిటెన్షన్ పూర్తి కావాల్సి ఉండగా, అక్టోబర్ 28న కొచ్చిలోని గ్రాండ్ హయత్ వేదికగా ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.