ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

రిపోర్టర్: సతీష్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజ నిర్మాణంలో గురువుల పాత్ర అమూల్యమని, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో వారు కీలకమని కొనియాడారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శవంతమైన జీవనశైలిని, విలువలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని సీఎం పిలుపునిచ్చారు. పాఠ్యాంశాలతో పాటు క్రమశిక్షణ, విలువలను బోధిస్తున్న గురువుల సేవలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.