ఒంటరి మహిళా పెన్షన్: 50 ఏళ్లు దాటితేనే అర్హత!
రిపోర్టర్: sankar p
స్థలం: మనుబోలు
మనుబోలు మండలంలో ఒంటరి మహిళా పెన్షన్ల కోసం దరఖాస్తులు చేసుకునే వారు తప్పనిసరిగా 50 ఏళ్లు నిండి ఉండాలని రెవెన్యూ అధికారులు స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా దరఖాస్తులు వస్తున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం 37, 47 ఏళ్ల వయసు కలిగిన మహిళలు కూడా దరఖాస్తులు చేస్తున్నారని, ఇది నిబంధనలకు విరుద్ధమని అధికారులు తెలిపారు. అర్హత కలిగిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు.