టాలీవుడ్ స్టార్ రానా నిర్మాతగా కంగనా రనౌత్ హారర్ థ్రిల్లర్
రిపోర్టర్: గోపి
స్థలం: హైదరాబాద్
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఓ భారీ హారర్ థ్రిల్లర్ సినిమా రాబోతోందని నటుడు రానా దగ్గుబాటి వెల్లడించారు. సురేష్ ప్రొడక్షన్స్ మరియు స్పిరిట్ మీడియా సంస్థలపై ఈ ప్రాజెక్ట్ తెరకెక్కుతోందని, తెలుగు దర్శకుడు రవిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన హారర్ కాన్ ఇండియా కార్యక్రమంలో ఈ సినిమా ప్రకటన వెలువడింది.