అసెంబ్లీ ముట్టడికి యత్నం.. బీజేవైఎం నాయకుల ముందస్తు అరెస్ట్

రిపోర్టర్: Alfa News Desk స్థలం: ఆత్మకూరు(ఎం)

ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేవైఎం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఆత్మకూరు(ఎం) మండలంలో ఈ ఘటన కలకలం రేపింది.

ఈ సందర్భంగా బీజేవైఎం మండల అధ్యక్షుడు ఫైళ్ల ప్రశాంత్ మాట్లాడుతూ, ప్రశ్నించే గొంతులను అణచివేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. బకాయిలు చెల్లించకుంటే పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో లోడి మహేష్, పొనగాని సూర్యప్రకాష్, బండారి సాయి ఉన్నారు.