గరివిడి జడ్పీటీసీ స్థానంలో బొత్స పూజిత ఘనవిజయం: వైసీపీ శ్రేణుల సంబరాలు

రిపోర్టర్: గోపి స్థలం: విజయనగరం

విజయనగరం జిల్లా గరివిడి మండల జడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బొత్స పూజిత 1,599 ఓట్ల మెజార్టీతో ఘనవిజయం సాధించినట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల లెక్కింపులో భాగంగా హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమె ప్రత్యర్థిపై స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శించి జడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఈ గెలుపుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్ కేంద్రం వెలుపల బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.