నెల్లూరులో రూ.21.40 కోట్లతో ఆధునీకరించిన ప్రభుత్వ పాఠశాలల ప్రారంభం

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సీఎస్‌ఆర్‌ నిధులతో అంతర్జాతీయ ప్రమాణాలతో ఆధునీకరించిన రెండు ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ బుధవారం ప్రారంభించనున్నారు. మూలాపేట పాఠశాలను రూ.13.40 కోట్లతో, స్టోన్‌హౌస్‌పేట ఆర్‌ఎస్‌ఆర్‌ పాఠశాలను రూ.8 కోట్ల వీపీఆర్‌ ఫౌండేషన్ సహకారంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ విద్యను మారుస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.