రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యమన్న బొప్పరాజు వెంకటేశ్వర్లు
రిపోర్టర్: సతీష్
స్థలం: విజయవాడ
విజయవాడలోని రెవెన్యూ భవన్‌లో ఏపీ రెవెన్యూ అసోసియేషన్ 18వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏపీ ఐకాస అమరావతి ఛైర్మన్‌గా బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆరో సారి, ప్రధాన కార్యదర్శిగా చేబ్రోలు కృష్ణమూర్తి మూడో సారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పని చేస్తామని, రెవెన్యూశాఖ గౌరవాన్ని కాపాడేలా పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తెస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.