అంబాయిపేటలో డీజే ఆపరేటర్లకు నోటీసులు ఇస్తున్న ఎస్హెచ్ఓ సార్

రిపోర్టర్: శ్రీనివాస్ స్థలం: కోనసీమ

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాయిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో నిబంధనలు ఉల్లంఘించే డీజే ఆపరేటర్లకు పోలీసులు నోటీసులు జారీ చేస్తున్నట్లు కోనసీమ పోలీస్ అధికారికంగా వెల్లడించారు. శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేసేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అనధికారికంగా భారీ శబ్దాలతో డీజేలు మోగిస్తే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానికంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా శాంతిభద్రతలను కాపాడటమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.