నవంబర్ ఒకటో తేదీన మంచిర్యాలలో మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు ఏర్పాట్లు

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

నవంబర్ ఒకటో తేదీన నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష నిర్వహించనున్నట్లు మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య తెలిపారు. ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పించడం జరుగుతుందని, అభ్యర్థులు ఎలాంటి ఆందోళన లేకుండా సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు.