సిటిజన్ ఫస్ట్ నినాదంతో సేవలు అందించాలని ప్రధాని మోదీ పిలుపు
రిపోర్టర్: సతీష్
స్థలం: దిల్లీ
సిటిజన్ ఫస్ట్ అనేది సివిల్ సర్వీస్ ఉద్యోగుల ప్రథమ లక్ష్యం కావాలని, నాగరిక్ దేవోభవ నినాదంతో ప్రజలకు సేవలు అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దిల్లీలో జరిగిన యూపీఎస్సీ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన ప్రసంగించారు. పేదల ఆవేదనను అర్థం చేసుకునే మనసు ప్రతి ఉద్యోగికి ఉండాలని సూచించారు. దేశం పట్టణీకరణ వైపు వెళ్తున్న తరుణంలో సవాళ్లను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధను సమర్థంగా వాడుకోవాలని ఆయన పేర్కొన్నారు.