భోగాపురం నుంచి దిల్లీకి నేటి నుంచి ఆకాశ ఎయిర్ సర్వీసులు
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: విజయనగరం
విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈనెల 25 నుంచి దిల్లీకి ఆకాశ ఎయిర్ సంస్థ రోజూ రానూపోనూ సర్వీసును ప్రారంభించనుంది. దిల్లీ నుంచి ఉదయం బయలుదేరి భోగాపురం చేరుకునే ఈ విమానం తిరిగి దేశ రాజధానికి వెళ్లనుంది. భోగాపురం నుంచి నేరుగా దిల్లీకి విమాన సర్వీసులు ప్రారంభం కావడం సంతోషకరమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.