మల్యాలలో ట్రాన్స్ఫార్మర్ల కాపర్ వైర్ల చోరీ ముఠా అరెస్ట్
రిపోర్టర్: రాము
స్థలం: మల్యాల
జగిత్యాల జిల్లా మల్యాల మండలంలో వ్యవసాయ పొలాల్లో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను పగులగొట్టి కాపర్ వైర్లు చోరీ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో కోట శ్రీను, వల్లపు సురేష్, సూర సురేష్లను అరెస్ట్ చేయగా, మరో నిందితుడు తపాలా బాబు పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి ప్యాసింజర్ ఆటో, 39 కిలోల కాపర్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. మల్యాల, వెల్గటూర్, ధర్మపురి, గొల్లపల్లి, బుగ్గారం మండలాల్లో ఈ ముఠా 10 ట్రాన్స్ఫార్మర్లలో కాపర్ వైర్లను దొంగిలించినట్లు పోలీసులు వెల్లడించారు.