ఉద్యోగుల వేతనాల్లో కోత రేవంత్ ప్రజా పాలనా: హరీశ్‌రావు

రిపోర్టర్: గోపి స్థలం: తెలంగాణ

మాటల్లో కోతలు, ఉద్యోగుల వేతనాల్లో కోతలు ఇదేనా రేవంత్ రెడ్డి చెప్పే ప్రజా పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. మున్సిపల్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు తగ్గించేలా తెచ్చిన జీవో 1181ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వేతనాలు తగ్గించడం ప్రజాపాలన కాదని, ప్రజా పీడన అని ధ్వజమెత్తారు.