యువతకు భారీ గుడ్ న్యూస్: ఢిల్లీ యూనివర్సిటీలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: న్యూఢిల్లీ

ఢిల్లీ యూనివర్సిటీలో ఈనెల 7వ తేదీన రెండో విడత మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ 'అవసర్ 2026' నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ వర్గాలు వెల్లడించాయి. సెంట్రల్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో జరగనున్న ఈ వేడుకలో ఎనభైకి పైగా సంస్థలు పాల్గొంటున్నాయి. ఇప్పటికే నాలుగు వేలకు పైగా విద్యార్థులు పేర్లు నమోదు చేసుకున్నారు. వార్షిక వేతనం పది లక్షలకు పైగా ఉందని, నెలవారీ స్టైఫండ్ అరవై వేల వరకు లభిస్తుందని అధికారులు తెలిపారు.