ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త ఇపీఎఫ్ వేతన పరిమితి పెంపు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: India

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 17వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఈ నూతన నిబంధన వల్ల దేశవ్యాప్తంగా దాదాపు 51 లక్షల మంది కొత్త ఉద్యోగులకు పీఎఫ్ కవరేజ్తో పాటు పెన్షన్, ఉచిత జీవిత బీమా వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలు అందనున్నాయి. ఈ వేతన పరిమితి పెంపు కారణంగా ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత లభించే నెలవారీ పింఛన్ కూడా గణనీయంగా పెరగనుంది.