ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ దాడికి గురైన భారత కెప్టెన్ స్మిత్ మచ్ఛార్

రిపోర్టర్: అశోక్ స్థలం: Dubai

ఫ్లైదుబాయ్ విమానంలో కో పైలట్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్ఛార్ గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దుబాయ్ నుండి టెల్ అవీవ్ వెళ్తున్న విమానంలో సెప్టెంబర్ 30న ఈ దారుణ ఘటన చోటుచేసుకుందని, ఈ దాడిని ఎదుర్కొని ఆయన ప్రయాణికులను కాపాడారని నివేదికలు వెల్లడించాయి. పైలట్ కావాలనేది తన చిన్ననాటి కల కాదని, ఏవియేషన్ సెమినార్ ద్వారా ఈ రంగంలోకి వచ్చానని ఆ ఇంటర్వ్యూలో మచ్ఛార్ తెలిపారు.