పీడీ ఉత్తర్వుల జారీపై కలెక్టర్లకు హైకోర్టు కీలక ఆదేశాలు
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
ప్రజా జీవనానికి విఘాతం కలిగించకుండా నేరగాళ్లను అడ్డుకునేందుకు పీడీ చట్టం కింద ముందస్తు నిర్బంధ ఉత్తర్వులు జారీచేసే సమయంలో జిల్లా కలెక్టర్లు సహేతుకమైన కారణాలను స్పష్టంగా పేర్కొనాలని హైకోర్టు తేల్చిచెప్పింది. ఇతర జిల్లాల నేరాలను పరిగణనలోకి తీసుకునేటప్పుడు, అవి స్థానిక శాంతిభద్రతలకు ఎలా విఘాతం కలిగిస్తాయో తెలపాలని స్పష్టం చేసింది. నెల్లూరు జిల్లా కలెక్టర్ జారీచేసిన పీడీ ఉత్తర్వులతోపాటు ప్రభుత్వ జీవోను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది.