వెంకటగిరి పోలేరమ్మ తల్లిని దర్శించుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి

రిపోర్టర్: Venkey ...Nlr స్థలం: పొదలకూరు

వెంకటగిరి శ్రీ పోలేరమ్మ తల్లి జాతర అత్యంత వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలోని ప్రజలందరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, కూటమి ప్రభుత్వం సుభిక్షంగా సాగాలని ఆయన ఆకాంక్షించారు. జాతర ఏర్పాట్లను ఘనంగా నిర్వహించిన ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను, ఆలయ చైర్మన్ మురళీని సోమిరెడ్డి అభినందించారు.