గ్రిడ్ స్టోరేజ్ కోసం రూ.14,500 కోట్ల కేటాయింపులకు కేంద్ర కేబినెట్ ఆమోదం
రిపోర్టర్: వెంకట్
స్థలం: Hyderabad / New Delhi
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ గ్రిడ్ స్కేల్ ఎనర్జీ స్టోరేజ్ కోసం రూ.14,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పథకానికి ఆమోదం తెలిపిందని G Kishan Reddy వెల్లడించారు. అలాగే ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టుల పథకం ఐదేళ్ల పొడిగింపుతో పాటు వికసిత్ భారత్ ఇనిషియేటివ్ కింద రూ.4,371.10 కోట్లతో విస్తార్ పథకానికి కూడా కేబినెట్ ఆమోద ముద్ర వేసిందని ఆయన స్పష్టం చేశారు.