విశాఖలో నేడు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహణ
రిపోర్టర్: సతీష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నం సిటీ పోలీసు కమిషనేట్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం 10 గంటలకు పీజీఆర్ఎస్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్ ఆఫీస్ లోని పోలీసు కాన్ఫరెన్స్ హాల్ లో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరగనుంది. నగర ప్రజలు తమ సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు విన్నవించుకోవాలని అధికారులు కోరారు. ఫిర్యాదుల స్వీకరణ అనంతరం తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోనున్నారు.