రిమోట్ వర్క్ వివాదం: పది నుంచి ఆరు గంటల ఉద్యోగం వీడిన మహిళ
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
ఉద్యోగంలో సమయ నియంత్రణపై ఐఐటీ కాన్పూర్ పూర్వ విద్యార్థిని కనక్ అగర్వాల్ లింక్ఇన్ వేదికగా కీలక విషయాలు వెల్లడించారు. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఆన్లైన్లో అందుబాటులో ఉండాలన్న నిబంధన నచ్చక తన స్నేహితురాలు రిమోట్ ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు ఆమె తెలిపారు. లొకేషన్ స్వేచ్ఛ కంటే సమయ స్వేచ్ఛే ఉద్యోగులకు అత్యంత ప్రధానమని, పని గంటలపై కంపెనీల తీరు మారుతున్న విధానంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని ఆమె పేర్కొన్నారు.