జపాన్ లో భారత క్రికెటర్లకు వసతి సమస్యలపై బీసీసీఐ ప్రత్యేక ఏర్పాట్లు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

జపాన్ లో ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్తున్న భారత పురుషుల క్రికెట్ జట్టుకు నిర్వాహకులు కేటాయించిన వసతి గదులు అత్యంత ఇరుగ్గా ఉండటంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. కిట్ బ్యాగులు కూడా పట్టని విధంగా గదులు ఉండటంతో, ఆటగాళ్ల సౌకర్యం కోసం బోర్డు చివరి నిమిషంలో నగోయాలో సొంతంగా ప్రత్యేక ప్రైవేట్ హోటల్ ఏర్పాట్లు చేసింది. అలాగే ఆటగాళ్ల కిట్స్ సైజుల్లో తలెత్తిన లోపాలను కూడా సరిదిద్దినట్లు ఐవోఏ వర్గాలు వెల్లడించాయి.