మురసు తుపాను బీభత్సం: విజయవాడ గుంటూరులో దంచికొట్టిన భారీ వర్షాలు
రిపోర్టర్: శివ
స్థలం: గుంటూరు
మురసు తుపాను ప్రభావంతో విజయవాడ మరియు గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు దంచికొట్టాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వానల కారణంగా ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. ప్రత్తిపాడు, కాకుమాను మండలాల్ లో చెరువులు పొంగిపొర్లడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మిరప, వరి పంటలు నీటిలో మునిగిపోయాయి.